Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 56

Vasishta disables Viswamitra's power !

|| om tat sat ||

బాలకాండ
ఏబది ఆరవ సర్గము.

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః |
ఆగ్నేయమస్త్రముత్ క్షిప్య తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ||

స|| ఏవం ఉక్తో వసిష్ఠేన మహాబలః విశ్వామిత్రః అగ్నేయ అస్త్రం ఉత్‍క్షిప్య తిష్ఠ తిష్ఠ ఇతి అబ్రవీత్ |

తా|| ఇట్లు చెప్పిన వసిష్ఠునితో ఆ మహాబలుడైన విశ్వామిత్రుడు అగ్నేయ అస్త్రమును సంధించి "నిలువుము నిలువుము" అని అనెను.

బ్రహ్మదండం సముత్‍క్షిప్య కాలదండ మివాపరమ్ |
వసిష్ఠో భగవాన్ క్రోధాత్ ఇదం వచన మబ్రవీత్ ||

స|| భగవాన్ వసిష్ఠః కాలదండ మివ అపరం బ్రహ్మదండం సముత్‍క్షిప్య క్రోధాత్ ఇదమ్ అబ్రవీత్ ||

తా|| భగవాన్ వసిష్ఠుడు కాలదండములా నున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపముతో ఇట్లు పలికెను.

క్షత్రబంధో స్థితో స్మ్యేష యద్బలం తద్విదర్శయ |
నాశయామద్య తే దర్పం శస్త్రస్య తవ గాధిజ ||

స|| హే క్షత్రబంధో! గాధిజ ! స్థితః అస్మి | యత్ శస్త్రస్య బలం తత్ విదర్శయ | అద్య తే దర్పం నాశయామి ||

తా||"ఓ క్షత్రబంధువా ! గాధిజ ! నిలుచునే యున్నాను. నీ శస్త్రముల బలమును చూపించుము. ఈదినమున నీ దర్పమును నాశనము చేసెదను".

క్వ చ తే క్షత్రియబలం క్వచ బ్రహ్మబలం మహత్ |
పశ్య బ్రహ్మ బలం దివ్యం మమ క్షత్రియపాంసన ||

స|| హే క్షత్రియ పాంసన ! పశ్య మమ దివ్యం బ్రహ్మ బలం |క్వచే క్షత్రియ బలం క్వచ బ్రహ్మ బలం మహత్

తా|| "ఓ దుష్ట క్షత్రియ ! చూడుము నా దివ్యమైన బ్రహ్మ బలము. నీ క్షత్రియబలమేక్కడ మహత్తరమైన బ్రహ్మబలమెక్కడ ?"

తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయముద్యతమ్ |
బ్రహ్మదండేన తచ్ఛాంతం అగ్నేర్వేగైవాంభసౌ ||

స|| గాధిపుత్రస్య ఘోర మాగ్నేయం తత్ బ్రహ్మ దండేన అగ్నైర్వేగ అంభసౌ ఇవ తత్ శాంతం ఉద్యతమ్ ||

తా|| విశ్వామిత్రునియొక్క ఆగ్నేయాస్త్రమును ఆ బ్రహ్మదండము అగ్నిని నీరు తో చల్లార్చినట్లు శాంతము చేసెను.

వారుణం చైవ రౌద్రం చ ఇంద్రం పాశుపతం తథా |
ఇషీకం చాపి చిక్షేప కుపితో గాధి నందనః ||

స|| కుపితో గాధినందనః వారుణం చ రౌద్రమ్ ఏవ తథా పాశుపతం ఇషీకం చ అపి చిక్షేప ||

తా|| అప్పుడు కుపితుడైన విశ్వామిత్రుడు వారుణాస్త్రము రౌద్రాస్త్రము అదేవిథముగా పాశుపతాస్త్రము ఇషీకాస్త్రమును ప్రయోగించెను.

మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తథా |
జృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే||

స|| మానవం మోహనం చ తథైవ గాంధర్వం స్వాపనం చ జృంభణం మాదనం చ సంతాపన్ విలాపనే చ ( చిక్షేప)||

తా|| మానవాస్త్రము, మోహనము అలాగే గాంధర్వము స్వాపనము జృంభణము మాదనము సంతాపన విలాపన అస్త్రములను అన్నింటినీ (ప్రయోగించెను)

శోషణం దారణం చైవ వజ్ర మస్త్రం సుదుర్జయమ్ |
బ్రహ్మ పాశం కాలపాశం వారుణం పాశమేవచ ||

స|| శోషణం దారణం చ సుదుర్జయం అస్త్రం వజ్రం చ బ్రహ్మ పాశం కాలపాశం వారుణం పాశమేవ చ ( చిక్షేప)

తా|| శోషణము, దుర్జయమైన దారణము, వజ్ర అస్త్రము, బ్రహ్మ పాశము, కాలపాశము , వారుణపాశము ప్రయోగించెను.

పైనాకాస్త్రం చ దయితం శుష్కార్ర్ద్రే అశనీ ఉభే |
దండాస్త్రమథ పైశాచంక్రౌంచమస్త్రం తథైవ చ ||

స|| పైనాకాఅస్త్రం దయితం చ ఉభే శుష్కాశనీ అర్ద్రాశనీ చ దండాస్త్రం పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ (చిక్షేప) ||

తా|| పైనాకాస్త్రము, దయితము , షుష్కాశనీ అర్ద్రాశనీ అను రెండూ, దండాస్త్రము,పైశాచము ( మొదలగు అస్త్రములను ప్రయోగించెను)

ధర్మ చక్రం కాలచక్రం విష్ణు చక్రం తథైవ చ |
వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా ||

స|| ధర్మ చక్రం కాలచక్రం తథైవ విష్ణుచక్రం వాయవ్యం మథనం హయశిరాస్త్రం తథా (చిక్షేప) ||

తా|| ధర్మ చక్రము, కాలచక్రము, అలాగే విష్ణు చక్రము , వాయవ్యము మథనము హయశిరాస్త్రములను (ప్రయోగించెను)

శక్తి ద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తథా |
వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణమ్ ||

స|| శక్తి ద్వయమ్ కంకాళం ముసలమ్ చ తథా వైద్యాధరం మహాస్త్రం చ దారుణం కాలస్త్రం చ చిక్షేప ||

తా|| శక్తి ద్వయములగు కంకాళము, ముసలము అలాగే , వైద్యాధరము అనబడు మహాస్త్రము, దారుణము, కాలాస్త్రములను ప్రయోగించెను.

త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాల మథ కంకణమ్ |
ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన ||

స|| హే రఘునందన ! అథ ఘోరమ్ అస్త్రం త్రిశూలం అ కాపాలం కంకణం చ అథ ఏతాని సర్వాణి అస్త్రాణి చిక్షేప ||

తా||ఓ రామా ! ఘోరమైన త్రిశులాస్త్రము కాపాలము కంకణము అను అస్త్రములను అన్నిటినీ ప్రయోగించెను.

వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తతద్భుతమివాభవత్ |
తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణస్సుతః ||
తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాధి నందనః ||

స|| బ్రహ్మణః సుతః తాని సర్వాణి దండేన గ్రసతే ! తత్ అద్భుతమివ అభవత్ | తేషు శాంతేషు గాధి నందనః బ్రహ్మాస్త్రం వసిష్ఠం జపతాం శ్రేష్ఠే క్షిప్తవాన్ |

తా|| ఆ బ్రహ్మసుతుడు ఆ అస్త్రములు అన్నిటినీ దండముతో నిగ్రహించెను. అది అద్భుతముగా నుండెను. అవన్నీ శాంతించ బడగా ఆ గాధి నందనుడు జపము చేయువారిలో శ్రేష్ఠుడైన వసిష్ఠుని మీద బ్రహ్మాస్త్రము ప్రయోగించెను.

తదస్త్ర ముద్యతమ్ దృష్ట్వా దేవాస్సాగ్ని పురోగమాః ||
దేవర్షయశ్చ సంభ్రాంతాః గంధర్వా స్సమహోరగాః |
త్రైలోక్యమాసీత్ సంత్రస్తం బ్రహ్మాస్త్రే సముదీరితే ||

స|| తత్ ఉద్యతమ్ అస్త్రం దృష్ట్వా స అగ్ని పురోగమాః దేవాః దేవర్షయశ్చ గంధర్వాః మహోరగాః సహ సంభ్రాంతః (ఆసీత్) బ్రహ్మాస్త్రే త్రైలోక్యం సంత్రస్తం సముదీరితే |

తా|| ముందుకు వచ్చుచున్న ఆ అస్త్రము చూచి అగ్ని ముందుంచుకొని దేవతలూ గంధర్వులు నాగులు భయభ్రాంతులైరి. బ్రహ్మాస్త్రముతో ముల్లోకములూ గజగజలాడిలోయెను.

తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా |
వశిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ ||

స|| హే రాఘవ | తత్ మహాఘోరం అస్త్రం బ్రాహ్మం అపి బ్రాహ్మేణ తేజసా బ్రహ్మ దండేన వసిష్ఠో గ్రసతే ||

తా|| ఓ రాఘవ ! ఆ మహాఘోరమైన బ్రహ్మాస్త్రమును కూడా ఆ బ్రహ్మ తేజసము గల బ్రహ్మ దండముతో వసిష్ఠుడు నిగ్రహించెను.

బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వసిష్ఠస్య మహాత్మనః |
త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్ సుదారుణమ్ |

స|| బ్రహ్మాస్త్రం గ్రసమానస్య మహాత్మనః వసిష్ఠస్య రౌద్రం సుదారుణమ్ రూపం త్రైలోక్య మోహనం ఆసీత్ ||

తా|| బ్రహ్మాస్త్రమును నిగ్రహించిన మహాత్ముడగు వసిష్ఠుని రౌద్రముగానున్న దారుణముగా నున్న రూపము ముల్లోకములనూ మూర్చిల్లచేసెను.

రోమ కూపేషు సర్వేషు వసిష్ఠస్య మహాత్మనః |
మరీచ్య ఇవ నిష్పేతుః ఆగ్నేర్దూమాకులార్చినః ||
ప్రాజ్వలద్బ్రహ్మదండశ్చ వసిష్ఠస్య కరోద్యతః |
విధూమ ఇవ కాలాగ్నిః యమదండ ఇవాపరః ||

స|| మహాత్మనః వసిష్ఠస్య సర్వేషు రోమ కూపేషు ధూమకులార్చిషః అగ్నేః మరీచ్య ఇవ నిష్పేతుః ||వసిష్ఠస్య బ్రహ్మదండశ్చ విధూమ ఇవ కాలాగ్నిః అపరం యమదండ ఇవ కరోద్యతః ||

తా|| మహానుభావుడైన వసిష్ఠుని యొక్క రోమ కూపములనుండి పొగతో నిండిన అగ్నిజ్వాలలు అగ్ని కిరణములవలె బయటికి వచ్చుచుండెను. వసిష్ఠుడు చేపట్టిన బ్రహ్మ దండము పొగలేని కాలా అగ్నివలెను మరియొక యమదండము వలెను ఉండెను'

తతోస్తువన్ మునిగణా వసిష్ఠం జపతాం వరమ్|
అమోఘమ్ తే బలం బ్రహ్మన్ తేజోధారయతేజసా||
నిగృహీతస్త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపాః |
ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాస్సంతు గతవ్యథాః||

స|| తతః మునిగణాః వసిష్ఠం జపతాం వరం స్తువన్ | హే బ్రహ్మన్ తే బలం అమోఘం తేజసా తేజః ధారయ || హే బ్రహ్మన్ ! విశ్వామిత్రో మహాతపాః త్వయా నిగృహీతః | జపతాం శ్రేష్ఠ ప్రసీద లోకః గత వ్యధాః సంతు |

తా|| 'అప్పుడు మునివరులందరూ జపము చేయువారలలో శ్రేష్ఠుడగు వసిష్ఠుని స్తుతించిరి. " ఓ బ్రహ్మన్ ! నీ బలము అమోఘము . నీ తేజస్సుతో ఆ ( బ్రహ్మస్త్రముయొక్క ) తేజస్సును ధరింపుము. ఓ బ్రహ్మన్ ! మహతపశ్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ జపము చేయువారలలో శ్రేష్ఠుడా ! ప్రసన్నుడివి కమ్ము. లోకములకు భాధలు తొలగిపోవుగాక !"

ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః |
విశ్వామిత్రోsపి వికృతో వినిశ్వస్యేదమబ్రవీత్ ||

స|| ఏవముక్తః మహాతపాః మహాతేజాః ( వసిష్ఠః ) శమం చక్రే |వికృతః విశ్వామిత్రః అపి వినిశ్వస్య ఇదం అబ్రవీత్ ||

తా||'ఇట్లు చెప్పబడిన మహాతపశ్శాలి మహతేజోవంతుడగు వసిష్ఠుడు ప్రశాంతచిత్తుడాయెను. పరాజయము పొందిన విశ్వామిత్రుడుకూడా ఇట్లు పలికెను

ధిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలం |
ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే ||
తదేతత్ సమవేక్ష్యాహం ప్రసన్నేంద్రియమానసః |
తపో మహత్ సమాస్థాస్యే యద్వైబ్రహ్మత్వకారణమ్||

స|| క్షత్రియ బలం ధిగ్బలం | బ్రహ్మ తేజో బలం బలం | ఏకేన బ్రహ్మదండేన మే సర్వ అస్త్రాణి హతాని || తత్ ఏతత్ సమవేక్ష్య అహం ప్రసన్న ఇంద్రియమానసః యది వై బ్రహ్మత్వ కారణమ్ మహత్ తపో సమస్థాస్యే ||

తా|| ."క్షత్రియబలము బలము కాదు. బ్రహ్మ తేజస్సుగలబలమే బలము. ఓక దండము చేతనే నా అస్త్రములన్నియు హరించబడినవి". అందువలన దీనిని (క్షత్రియబలము) త్యజించి , ప్రశాంతమనస్సుతో ఏది బ్రహ్మత్వమునకు కారణమో దానికొఱకు మహా తపస్సు చేసెదను" అని'.

||ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్పంచాశస్సర్గః ||

|| ఈ విధముగా వాల్మీకి రామాయనములో బాలకాంద లో ఎబది ఆఱవ సర్గము సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||

 

|| om tat sat ||